عَمَّ يَتَسَاءَلُونَ (1) ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు |
عَنِ النَّبَإِ الْعَظِيمِ (2) ఆ మహా వార్తను గురించేనా |
الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ (3) దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో |
كَلَّا سَيَعْلَمُونَ (4) అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు |
ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ (5) ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు |
أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا (6) ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా |
وَالْجِبَالَ أَوْتَادًا (7) మరియు పర్వతాలను మేకులుగా |
وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا (8) మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము |
وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا (9) మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము |
وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا (10) మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము |
وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا (11) మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము |
وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا (12) మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము |
وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا (13) మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము |
وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا (14) మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము |
لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا (15) దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి |
وَجَنَّاتٍ أَلْفَافًا (16) మరియు దట్టమైన తోటలను |
إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا (17) నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం |
يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا (18) ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు |
وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا (19) మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి |
وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا (20) మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి |
إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا (21) నిశ్చయంగా, నరకం ఒక మాటు |
لِّلطَّاغِينَ مَآبًا (22) ధిక్కారుల గమ్యస్థానం |
لَّابِثِينَ فِيهَا أَحْقَابًا (23) అందులో వారు యుగాల తరబడి ఉంటారు |
لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا (24) అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు |
إِلَّا حَمِيمًا وَغَسَّاقًا (25) సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప |
جَزَاءً وِفَاقًا (26) (వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా |
إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا (27) వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు |
وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا (28) పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు |
وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا (29) మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము |
فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا (30) కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము |
إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا (31) నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది |
حَدَائِقَ وَأَعْنَابًا (32) ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ |
وَكَوَاعِبَ أَتْرَابًا (33) మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు |
وَكَأْسًا دِهَاقًا (34) మరియు నిండి పొర్లే (మధు) పాత్ర |
لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا (35) అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు |
جَزَاءً مِّن رَّبِّكَ عَطَاءً حِسَابًا (36) (ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం |
رَّبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا (37) భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు |
يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا (38) ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు |
ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا (39) అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి |
إِنَّا أَنذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا (40) నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు |