لَا أُقْسِمُ بِهَٰذَا الْبَلَدِ (1) కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను) |
وَأَنتَ حِلٌّ بِهَٰذَا الْبَلَدِ (2) మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది |
وَوَالِدٍ وَمَا وَلَدَ (3) మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా |
لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي كَبَدٍ (4) వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము |
أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ (5) ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా |
يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا (6) అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు |
أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ (7) ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా |
أَلَمْ نَجْعَل لَّهُ عَيْنَيْنِ (8) ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా |
وَلِسَانًا وَشَفَتَيْنِ (9) మరియు నాలుకను మరియు రెండు పెదవులను |
وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ (10) మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము |
فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ (11) కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు |
وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ (12) మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా |
فَكُّ رَقَبَةٍ (13) అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం |
أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ (14) లేదా! (స్వయంగా) ఆకలి గొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం |
يَتِيمًا ذَا مَقْرَبَةٍ (15) సమీప అనాథునికి గానీ |
أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ (16) లేక, దిక్కులేని నిరుపేదకు గానీ |
ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ (17) మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం |
أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ (18) ఇలాంటి వారే కుడిపక్షం వారు |
وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ (19) ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు |
عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ (20) వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది |